Chiranjeevi: క్యాన్సర్ గురించి చిరంజీవి.. సంచలన విషయం చెప్పిన మెగాస్టార్
స్వయంకృషితో ఎదగడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పే హీరో చిరంజీవి. చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగాస్టార్ గా, బాస్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల వరుస పెట్టి సినిమాలతో తెగ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం యువ దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టారు.
అయితే చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ బారిన పడినట్లు తాజాగా షాకింగ్ విషయం వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

రీమేక్ మూవీస్: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ఎక్కువగా రీమేక్ చిత్రాలే ఉంటున్నాయి. ఇప్పటికే లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ మూవీతో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ అజిత్ వేదాళం చిత్రానికి భోళా శంకర్ రీమేక్ అని దాదాపుగా ఖరారు అయింది.

80 శాతం పూర్తి: భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా నటిస్తోంది. అలాగే చిరుకి చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. ఇందులో టాక్సీ డ్రైవర్ గా చిరు అలరించనున్నారు.

బ్రో డాడీ రీమేక్: భోళా శంకర్ మూవీతో పాటు యువ దర్శకుడితో కూడా చిరంజీవి ఓ సినిమా (Mega156) చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. బ్రో డాడీ మలయాళం రీమేక్ లో చిరు చేస్తున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ మరో హీరోగా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
సంచలన కామెంట్స్: ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయం ఎవరో చెప్పలేదు. స్వయంగా ఆయనే చెప్పారు. హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రి స్టార్ హాస్పిటల్ కొత్తగా క్యాన్సర్ సెంటర్ ప్రారంభించింది. ఈ సెంటర్ ను చిరంజీవి చేతులమీదుగా స్టార్ట్ చేశారు. ఈ ఓపెనింగ్ లో తాను క్యాన్సర్ బారిన పడినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు చిరు.
ఇబ్బందిపడటం లేదు: "క్యాన్సర్ వ్యాధిని ఎర్లీ స్టేజీలో కనిపెడితే.. అది పెద్ద జబ్బు కాదు. ప్రజల్లో అవగాహన రావాలి. నేను ఈ వి,యం ఇంతవరకు బయట చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను. నాకు 45 ఏళ్లు దాటిన తర్వాత ఓ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకున్నా. క్యాన్సర్ ఎర్లీ స్టేజీలో ఉందని తెలిసింది. దాంతో ఏఐజీ హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకొన్నా. ఒకవేళ నేను పట్టించుకోకపోతే ఏమైపోయి ఉండేదో అని చిరంజీవి అన్నారు. ఇది బయటకు చెప్పడానికి నేను ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు" అని చిరంజీవి వెల్లడించారు.
అవగాహన కలుగుతుంది: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ కు గురి చేశాయి. దీంతో వైరల్ గా మారాయి. అయితే ఒక స్టార్ హీరో ఈ విధంగా ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో వైద్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన పెరుగుతుందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టెస్టులు చేయించుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











