Chiranjeevi Review on Peddi: చరణ్ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం..పెద్దిపై చిరంజీవి భావోద్వేగం

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జూన్ 4వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే జూన్ 3వ తేదీన పెద్ది ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. రాత్రి నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో పాటు రామ్ చరణ్‌ను అభిమానులు, ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక ఆర్ఆర్ఆర్, ఒక పెద్ది అని.. రామ్ చరణ్‌కు ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది విజయంపై రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Chiranjeevi Review on Peddi Mega Star Gets Emotional Over Ram Charan s Success Praises Buchi Babu s Vision

నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయమని చిరంజీవి అన్నారు.

ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారికి అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబుకి చిరు అభినందనలు తెలిపారు.

అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన రత్నవేలు గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన కొల్లా అవినాష్ గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలి గారికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్ర విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్యెందు శర్మ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా.. పెద్ది సినిమా ప్రారంభమైన నాటి నుంచి షూటింగ్, ఇతర అంశాలను చిరంజీవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. స్వయంగా సెట్‌కి వెళ్లి యూనిట్‌కి అభినందనలు తెలిపారు. అలాగే పర్సెంటేజ్ ఇబ్బందుల వల్ల పెద్ది రిలీజ్‌పై నీలినీడలు కమ్ముకోవడంతో స్వయంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు చిరంజీవి. ట్రైలర్‌ను ముందే చూసిన చిరంజీవి అందులోని డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్‌లు రఫ్పాడించేశారని అప్పుడే మెగాస్టార్ ప్రశంసించారు. ఇప్పుడు సినిమా రిలీజైన తర్వాత అందరూ ఈ ముగ్గురు లేకపోతే పెద్ది లేదంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మరోసారి తన కుమారుడి చిత్రం విజయంపై చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.

Read more about: chiranjeevi peddi ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X