Acharya OTT: ఆ సంస్థకు ఆచార్య స్ట్రీమింగ్ హక్కులు.. రిలీజైన ఎన్ని రోజులకు వస్తుందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ తరహాలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చాలా వరకు విజయం సాధించడంతో.. దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ముందడుగు వేస్తున్నారు. ఫలితంగా మరిన్ని చిత్రాలు పట్టాలెక్కుతున్నాయి. ఇలా మెగా హీరోల కలయికలో రాబోతున్న సినిమానే 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో నటిస్తున్నాడు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలో సెకెండ్ వేవ్ రావడంతో మళ్లీ చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించి.. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, దాదాపుగా డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే అంటు చిరు.. ఇటు చరణ్ వేరే సినిమాలు చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' ఓటీటీ పార్ట్‌నర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.
కొంత కాలంగా ఓటీటీల హవా బాగా కనిపిస్తోంది. అందుకే ఆయా సంస్థలన్నీ బడా చిత్రాలను కొనడానికి పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే 'ఆచార్య' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర యూనిట్ భారీ మొత్తం చెల్లించిందట. ఇది చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. ఇక, ఈ సినిమాను థియేటర్లలోకి వచ్చిన ఆరు వారాలకు స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











