twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆచార్య’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

    |

    టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీ టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్‌ను కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇందులో కేవలం చిరంజీవి పార్టునే చూపించబోతున్నారని అంటున్నారు. ఇది దాదాపు 60 సెకెండ్ల నిడివితో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ టీజర్‌పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలే ఉన్నాయి.

     Chiranjeevis Acharya Teaser Release Date Fix

    ఇదిలా ఉండగా.. మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ పోషించే పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఇందులో చరణ్‌కు జోడీగా నటించే హీరోయిన్‌ విషయంలో త్వరలోనే క్లారిటీ రాబోతుంది. మరోవైపు, దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 'ఆచార్య'ను 2021 మే 14న కానీ, 21వ తేదీన కానీ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Megastar Chiranjeevi upcoming Movie Sye Raa Narasimha Reddy. After This movie He Starts project With Koratala Siva. upcoming film #Chiru152 will revolve around temples and endowments department and how the negligence of temples is bad for the society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X