Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
‘ఆచార్య’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోంది. అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీ టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్‌ను కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇందులో కేవలం చిరంజీవి పార్టునే చూపించబోతున్నారని అంటున్నారు. ఇది దాదాపు 60 సెకెండ్ల నిడివితో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ టీజర్‌పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ పోషించే పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఇందులో చరణ్‌కు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో త్వరలోనే క్లారిటీ రాబోతుంది. మరోవైపు, దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 'ఆచార్య'ను 2021 మే 14న కానీ, 21వ తేదీన కానీ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.