దూసుకుపోతోన్న ‘ఆచార్య’ టీజర్: వచ్చిన కాసేపటికే ట్రెండింగ్.. అందులోనూ సత్తా చాటిందిగా
మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. సందేశాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు.
మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'ఆచార్య' టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేశారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఇందులో యాక్షన్ సీన్స్‌ను చూపించారు. ఇందులో చిరంజీవి లుక్.. స్టైల్స్ అదరగొట్టేశాయి. అలాగే, 'పాఠాలు చెప్పకపోయినా అందరూ ఆచార్య అని పిలుస్తుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో' అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కేకలు వేయిస్తోంది. అద్భుతమైన విజువల్స్‌కు మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిఇచ్చిందనే చెప్పాలి. ఈ కారణంగా ఈ టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'ఆచార్య' టీజర్ ఆకట్టుకుందనే చెప్పాలి. అందుకే దీనికి కేవలం 20 గంటల్లోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, 5 లక్షలకు పైగా లైకులు కూడా వచ్చాయి. దీంతో వేగంగా అన్ని లైకులు సాధించిన మూడో సినిమా టీజర్‌గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఈ వేగం చూస్తుంటే వ్యూస్ పరంగా 8 మిలియన్ మార్క్‌ను దాటే అవకాశం కూడా ఉంటుంది. ఇక, ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' టీజర్ 24 గంట్లలో 8.57 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే, 77 లక్షలు పైచిలుకు లైకులు కూడా అందుకుంది.


Click it and Unblock the Notifications











