అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టిన చిరంజీవి: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ అదిరిపోయే ప్రకటన

కొంత కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆయన కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆ వెంటనే 'ఆచార్య' అనే సినిమాను కూడా మొదలు పెట్టేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

'ఆచార్య' షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో పలుమార్లు కోవిడ్ వల్ల లాక్‌డౌన్ వచ్చింది. దీంతో ఈ గ్యాప్‌ను తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం వాడుకున్నారు చిరంజీవి. ఇందులో భాగంగానే అప్పుడే కొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పూర్తి చేసుకుంటూ వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు.

Chiranjeevis Bholaa Shankar Movie Start on 11th Novemeber

చిరంజీవి ప్రకటించిన వాటిలో 'భోళా శంకర్' మూవీని టాలీవుడ్‌లో ఫ్లాప్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో రూపొందనున్న ఈ సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇప్పటికే దర్శకుడు కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశాడట. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అయింది.

'భోళా శంకర్' మూవీని ఈ ఏడాది ప్రారంభించే అవకాశాలు లేవన్నదే ఆ వార్త సారాంశం. చిరంజీవి ముందుగా బాబీతో సినిమా చేస్తారని.. ఈ కారణంగా మెహర్ రమేష్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై అదిరిపోయే ప్రకటన వెలువడింది. దీని ప్రకారం.. 'భోళా శంకర్' మూవీని నవంబర్ 11, ఉదయం 7:45 గంటలకు జరిగే పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారట. అంతేకాదు, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను సైతం నవంబర్ 15 నుంచి ఆరంభించబోతున్నారని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో దీనిపై నెలకొన్న అనుమానాలకు పుల్‌స్టాప్ పడిపోయింది.

'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ మూవీలో ఆయన ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారట. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X