చిరంజీవితో బుచ్చిబాబు సినిమా? మెగాస్టార్ అలాంటి కండీషన్!

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ 400 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లో సోలోగా అతిపెద్ద విజయాన్ని అందించింది సోలో. ఈ చిత్రంలో చరణ్ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదే సమయంలో పెద్ది తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా తీస్తాడంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉండగా.. మరికొందరు పేర్లు తెరపై ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరారు. దీనిపై స్వయంగా చిరు స్పందించారు.

రామ్ చరణ్‌కు పెద్దితో తిరుగులేని హిట్ అందించిన బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు తదితరులను చిరంజీవి తన ఇంటికి పిలిపించి అభినందించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ది షూటింగ్, రిలీజ్ తర్వాత సంగతులు, ఫీడ్ బ్యాక్‌ను చిరుకు తెలియజేశారు బుచ్చిబాబు. ఈ ముచ్చట్లను చిత్ర యూనిట్ వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. మాకు పెద్ది ప్రపంచాన్ని చూపించావు, చూసిన తర్వాత కోలుకోవడానికి టైం పట్టింది, నిద్రలోనూ అవే ఆలోచనలు, ఆ సన్నివేశాలు కనిపిస్తున్నాయని బుచ్చిబాబుని చిరంజీవి ప్రశంసించారు.

Chiranjeevi s Fun Response to Buchi Babu Sana s Movie Offer Goes Viral

ఈ సినిమా కోసం చరణ్ ఇంట్లో ఎంత కష్టపడేవాడో నేను చూసేవాడిని. 5 గంటలకు లేచి వర్కవుట్స్ చేసుకుని 9 గంటలకల్లా షూటింగ్‌కి వెళ్లిపోయేవాడు. మళ్లీ రాత్రి నువ్వు 9 గంటలకు వదులుతావో, 10 గంటలకు వదులుతావో ఆ టైంలో సూప్‌ లాంటిది తాగి మళ్లీ జిమ్‌కి వెళ్లిపోయేవాడు. ఆ 70 రోజులు మాలలో ఉండటం వల్ల వెజిటీరియన్‌గా ఉన్నాడు. హై ప్రోటీన్ కావాలి నాన్‌వెజ్ తినకూడదు.. అదంతా చూస్తుంటే ఇది అవసరమా? ఇంత కష్టపడాలా? మనం కూడా చేశాం కష్టమైన క్యారెక్టర్లు .. రిస్క్‌లు చేశాం, దీనికి ప్రతిఫలం ఎలా ఉంటుందోనని వాళ్లమ్మ అయితే భగవంతుడికి దండం పెట్టుకునేది. పెద్ది సినిమా ప్రజల్లో ఒక అవేర్‌నెస్ తీసుకొస్తోంది. బిడ్డలకు మనం ఏం ఇవ్వాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా పెంచాలి అనేది తీసుకుంటున్నారు. ఇలాటి సినిమాని మళ్లీ చూస్తావేంటీ? అని చిరంజీవి సరదాగా అన్నారు.

మీరు నాకు ఫస్ట్ మూవీ ఉప్పెన ఇచ్చారు, చరణ్ సార్ పెద్ది ఇచ్చారు.. మీతో కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని బుచ్చిబాబు అడగ్గా.. చిరంజీవి స్పందిస్తూ నువ్వు పరిగెత్తమని, దూకమని, వైర్లతో ఇలాంటివన్నీ చేస్తే వెళ్లవయ్యా అంటా. ఇప్పటికీ వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్టీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర వరప్రసాద్ గారికి కూడా చేయించారు. పని, అవసరం అనుకుంటే దేనికీ భయపడను, వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. అయితే ఒకసారి వైర్లు కట్టడం వల్ల ఒళ్లంతా కమిలిపోయింది. చరణ్ అది చూసి ఏం జరిగిందని అడిగాడు. వైర్ కట్టారు అని చెప్పడంతో ఇంకా కడుతున్నారా అంటూ వాళ్లని పిలిచి ఆయన్ని ఇలా కష్టపెడతారా అని తిట్టాడు. వాళ్ల తప్పేం లేదు.. డూప్ సరిగా చేయలేదని ఆ షాట్ నేనే చేశానని చెప్పానని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

రామ్ చరణ్ రోజూ కష్టపడి ఇంటికొచ్చిన ప్రతిసారి నాకు మా నాన్నగారు ఏమన్నారో గుర్తొచ్చేది. దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల మేడ మీదకి వెళ్లాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. ఇప్పటిలా వైర్లు లాంటి సేఫ్టీ డివైస్‌లు లేవు మొండిగా చేసుకుంటూ వెళ్లడమే. అలాగే ట్రైన్ కింద పడుకునే సీన్ చేయాలి ఇవన్నీ మా నాన్నగారు చూసి ఇంటి దగ్గర చాలా బాధపడేవారు. కోపంతో బూతులు తిట్టేసేవారు. సినిమా కోసం తప్పదు చేయాల్సిందే అన్నాను. రేపొద్దున నీకు కొడుకు పుట్టి వాడు హీరో అయి ఇలాగే కష్టపడుతుంటే అప్పుడు నీకు తెలుస్తుందని అనేవారు. నిజంగా నీ పెద్ది సినిమాకి చేసి వాడు అలిసిపోయి వచ్చి కూర్చొని, మణికట్టు దెబ్బ తగిలిందని, కంటి మీద కుట్లు పడ్డాయి అన్నప్పుడు బాధేసింది. అప్పుడే మా నాన్నగారి మాటలు గుర్తొచ్చాయి. అదే బాధ నేను అనుభవించా.. వాడు కష్టపడుతున్నప్పుడు గుండెని పిండిని ఫీలింగ్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ నుంచి మనిషిని కట్టిపడేసింది. హాస్పిటల్ సీన్ తలచుకుంటే గూస్‌బంప్స్ వస్తాయి.. వాడి నటనకి చివరి వరకు నాకు కంటతడి ఆగలేదని చిరు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: chiranjeevi buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X