మెగా 158 కోసం చిరంజీవి కష్టం చూశారా? 70 ఏళ్ల వయసులో ఇలా మేకోవర్!

కృషి, పట్టుదల, ప్రతిభ ఉంటే ఎవరైనా అసాధారణ విజయాలు సాధించవచ్చని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. నాలుగు దశాబ్ధాలుగా తెలుగు తెరను రారాజుగా ఏలుతున్నారు చిరు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చేయలేదు. ఆయన కష్టం, శ్రమ, అంకిత భావం చిరంజీవిని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ తొలి సినిమా మాదిరిగానే ప్రతి సినిమాకు కష్టపడతారు చిరు. తాజాగా తన 158వ సినిమా కోసం బాస్ శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ఈ ఏడాది తన కెరీర్‌లోనే భారీ బ్లాక్‌బస్టర్‌ను కొట్టారు చిరంజీవి. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసిన ఆయన.. కొన్నాళ్లు విరామం తీసుకుని తిరిగి షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. దర్శకుడు బాబీతో తన 158వ సినిమాను చేయనున్నారు చిరు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య ఘన విజయం సాధించడంతో మెగా 158పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు మన శంకర వరప్రసాద్ గారు ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో మెగా 158 ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Chiranjeevi s Intense Workout Video For Mega 158 Goes Viral

చిరంజీవిని గతంలో ఎన్నడూ చూపించని విధంగా మాస్ లుక్‌లో చూపించేందుకు డైరెక్టర్ బాబీ సిద్ధమవుతున్నారు. ముంబైలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట బాబీ. అలాగే ఈ సినిమా కోసం రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా కాకా అనే పేరు వైరల్ అవుతోంది. మెగా 158 క్యాస్టింగ్ విషయంలోనూ బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తారని గాసిప్స్ వస్తున్నాయి. చిరంజీవితో దశాబ్థాలుగా ఉన్న అనుబంధం దృష్ట్యా మోహన్‌లాల్ కూడా వెంటనే ఒప్పుకున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మెగా 158లో చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటించనున్నారని టాక్. వీరిద్దరి కలయికలో ఇదే తొలి సినిమా కావడం విశేషం. చిరంజీవితో నటించే ఛాన్స్ రావడంతో ప్రియమణి సైతం ఎగ్జియిటింగ్‌తో వెయిట్ చేస్తోందట. అలాగే చిరంజీవికి కూతురికి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. జన నాయగన్, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ మెగా 158ని నిర్మించనుంది. ఇప్పటికే మెగా 158 సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఇందులో మెగా 158 కోసం తాను జిమ్‌లో ఎలా కష్టపడుతున్నది చూపించారు చిరంజీవి. 70 ఏళ్ల వయసులోనూ కఠినమైన వర్కవుట్స్ చేస్తూ చెమట చిందిస్తున్నారు. ప్రతిరోజూ మన పరిమితులను దాటి ముందుకు సాగడానికి లభించే మరో అద్భుతమైన అవకాశం అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు చిరు. అలాగే మే 21న పూజా కార్యక్రమాలతో మెగా 158 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వయసులోనూ మీ డెడికేషన్, ఫిట్‌నెస్‌ లెవెల్స్ వేరే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద ఈ వీడియోతోనే మెగా 158పై హైప్ పెంచేశారు చిరు.

Read more about: chiranjeevi director bobby
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X