అవన్నీ పుకార్లేనంటోన్న ‘లూసీఫర్’ యూనిట్: ఎవరినీ ఫైనల్ చేయలేదంటూ క్లారిటీ

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ప్రస్తుతం 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది పట్టాలపై ఉండగానే ఈ మెగా హీరో మరిన్ని చిత్రాలను ప్రకటించేశారు. అందులో 'లూసీఫర్' రీమేక్ ఒకటి. 'హనుమాన్ జంక్షన్' ఫేం మోహన్ రాజా రూపొందించనున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉంటుందని చిత్ర యూనిట్ ఇది వరకే చెప్పింది. మలయాళంలో లేకపోయినా.. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఈ విషయంలో మార్పులు చేసినట్లు దర్శకుడు వెల్లడించాడు. దీంతో ఇందులో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగానే లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు ఇటీవల త్రిష పేరు తెరపైకి వచ్చింది. వీళ్లిద్దరిలో ఒకరు ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'లూసీఫర్' రీమేక్ హీరోయిన్‌ గురించి క్లారిటీ వచ్చేసింది.

 Chiranjeevis Lucifer Remake Heroine Update

తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'లూసీఫర్' రీమేక్‌ కోసం ఇప్పటి వరకూ ఏ హీరోయిన్‌నూ ఫైనల్ చేయలేదట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌లోని ఓ ప్రముఖుడు వెల్లడించినట్లు న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకూ వచ్చినవన్నీ పుకార్లేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X