చిరంజీవి కొత్త సినిమాపై క్లారిటీ: అప్పటి నుంచే షురూ చేయడానికి ప్లాన్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటుండగానే.. ఏకంగా మూడు ప్రాజెక్టులను స్వయంగా అనౌన్స్ చేశారు. అందులో మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' రీమేక్ ఒకటి. ఎప్పుడో ప్రకటించిన ఈ ప్రాజెక్టు ఇంకా మొదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఓ గుడ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ రూపొందించిన 'లూసీఫర్'ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టు 22న ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఆరోజు చిరంజీవి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకునే చిత్రీకరణను మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా కోసం మోహన్ రాజా స్క్రిప్టులో ఎన్నో మార్పులు చేశాడు. ఒరిజినల్‌లో లేని హీరోయిన్ పాత్రను కూడా దీనికి యాడ్ చేశాడు. అలాగే, చిరంజీవి క్యారెక్టరైజేషన్‌కు కూడా మరింత ఎలివేషన్ పెట్టాడని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. హీరోయిన్‌గా అనుష్క శెట్టి నటిస్తున్నట్లు ఈ మధ్యనే ఓ వార్త బయటకు వచ్చింది. అలాగే, ఇందులో హీరో చెల్లెలిగా ప్రియమణి గానీ, సుహాసిని కానీ నటించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











