చిరు లేటెస్ట్ అప్‌డేట్.. అయన చుట్టూనే అందరూ.. సింగిల్ ఫ్రేమ్‌లో!
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా తమన్నా ముఖ్యపాత్ర పోషించింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో చిరంజీవి సహా నయన తార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు అందరూ సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఇట్టే వైరల్‌గా మారింది. ఇలా 'సైరా' లో అందరి లుక్స్ ఒకేసారి చూసి ఫిదా అవుతున్నారు మెగా అభిమానులు.

ఇక చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 20 (ఈ రోజే) విడుదలైన సైరా నరసింహా రెడ్డి టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వేగంగా వ్యూస్ రాబడుతూ సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. మెగాస్టార్ కెరీర్‌లో తొలిసారి ఇలాంటి కథాంశంతో సినిమా రావడం, చిరు రీ ఎంట్రీ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక సినిమా కావడంతో 'సైరా'పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











