షాకింగ్: సైరా ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లో.. రంగంలోకి..

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నర్సింహరెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతున్నది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రాథమిక సమాచారం ప్రకారం భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తున్నది. అయితే ఓ వైపు వసూళ్లు పక్కాగా ఉంటే మరో వైపు వాటికి గండి కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రిటిక్స్ సైతం సైరా సైసైరా అంటూ ఉండగా.. హ్యాకర్లు ఈ సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

సైరా ఆన్‌లైన్‌లోకి

సైరా ఆన్‌లైన్‌లోకి

సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం.. పలు చోట్ల సైరా చిత్రాన్ని మధ్యాహ్నానికి కల్లా లీక్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఫ్రీ డౌన్‌లోడ్ ఆఫ్షన్ కూడా ఇవ్వడంతో సినీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. సైరా యూనిట్ ఇప్పటికే ఇలాంటి చౌర్యాన్ని నిలువరించేందుకు భారీగా సైబర్ క్రైమ్ అధికారులకు ముందస్తు చర్యగా ఫిర్యాదు చేసింది.

బ్రహ్మాండమైన టాక్‌ రావడంతో

బ్రహ్మాండమైన టాక్‌ రావడంతో

సైరాకు బ్రహ్మండమైన టాక్ రావడంతో ప్రేక్షకుల్లో విపరీతంగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే థియేటర్లన్నీ హౌస్‌ఫుల్‌గా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పైరసీకి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొంత మేరకు నష్టం వాటిల్లినా పెద్దగా సమస్య ఉండకపోవచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

సైబర్ క్రైమ్ రంగంలోకి

సైబర్ క్రైమ్ రంగంలోకి

ఏ సినిమానైనా పైరసీ బారిన పడటం ఇబ్బందికరమే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సైరా యూనిట్ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొన్నట్టు తెలుస్తున్నది. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సైబర్ క్రైమ్ విభాగాన్ని అలర్ట్ చేసినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర మాధ్యమాల్లో సినిమా క్లిప్పింగులు, డైలాగులు దర్శనమిచ్చాయి. సెలబ్రిటీలు కూడా షేర్ చేయడం గమనార్హం.

Recommended Video

Chiranjeevi Speech @ Sye Raa Narasimha Reddy Pre Release Event Kerala
హిస్టరీని స్క్రీన్‌పై క్లాసిక్‌గా

హిస్టరీని స్క్రీన్‌పై క్లాసిక్‌గా

సైరా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద క్లాసిక్‌గా చెప్పారనే, ఎమోషన్‌ను, యాక్షన్‌ను కలబోసి కిక్కించారనే అభిప్రాయం సినీ క్రిటిక్స్‌లో వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ కేక పెట్టిస్తున్నదని ముక్తకంఠంతో అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X