విడుదలకు ముందే 'సైరా' సెన్సేషన్.. భారీ ధరకు అమ్ముడైన సినిమా హక్కులు
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ 151 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో విడుదలకు ముందే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సైరా హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

మెగాస్టార్ కెరీర్‌లోనే మొదటిసారి
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. 150 సినిమాల అనుభవమున్న మెగాస్టార్ కెరీర్ లోనే చారిత్రాక నేపథ్యంలో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అందుకే చిరంజీవి సైతం ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు.

భారీ డిమాండ్.. బడా సంస్థలు
ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. బడా నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ఈ హక్కులను చేజిక్కించుకున్నాయని ఫిలిం నగర్ టాక్. చిరు గత సినిమాల
ట్రేడ్ రికార్డులను తిరగరాసేలా ఏకంగా థియేట్రికల్ హక్కుల రూపంలోనే 100 కోట్లకు పైగా వచ్చాయని తెలుస్తోంది.

బరిలో సాహో నిర్మాణ సంస్థ
సాహో సినిమాను నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బరిలోకి దిగిందని, ఈ సంస్థ 'సైరా నరసింహా రెడ్డి' నైజాం హక్కులను 30 కోట్ల రూపాయలు చెల్లించి చేజిక్కించుకుందని తెలిసింది. అలాగే ఆంధ్ర ప్రాంత హక్కులను 60 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. ఇక ఉత్తరాంధ్రలో దాదాపు 15 కోట్లకు, సీడెడ్ లో 25 కోట్లకు `సైరా` హక్కులను విక్రయించినట్టు సమాచారం. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా హక్కులు 100 పైన వసూలు చేశాయని చెప్పుకోవచ్చు.

సైరా నరసింహా రెడ్డి మూవీ
1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











