twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కెరీర్‌లోనే ది బెస్ట్ 'సైరా'.. గిఫ్ట్ ఇచ్చి గురిపెట్టిన రామ్ చరణ్!

    |

    తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా దేశ విదేశాల్లో రికార్డుల మోత మోగిస్తోంది. రామ్ చరణ్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి పోషించిన రోల్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా చిరు కెరీర్ లోనే అరుదైన ఫీట్ సాధించింది. వివరాల్లోకి పోతే..

    అప్పుడలా ఇప్పుడిలా.. తండ్రికి కానుక

    అప్పుడలా ఇప్పుడిలా.. తండ్రికి కానుక

    మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ సినీ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఖైదీ నెంబర్ 150 ద్వారా తండ్రిని గ్రాండ్‌గా సినిమాల్లోకి ఆహ్వానించి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి సినిమా రూపంలో మరో అద్భుతమైన చిత్రాన్ని తండ్రికి కానుకగా ఇచ్చారు.

    గాంధీ జయంతి మొదలుకొని నేటి వరకూ

    గాంధీ జయంతి మొదలుకొని నేటి వరకూ

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీన విడుదల చేశారు. దీంతో ఆ రోజు మొదలైన సైరా కలెక్షన్ల సునామీ నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా చిరంజీవి కెరీర్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఆనందంలో మునిగితేలిన చిత్రయూనిట్ ఆ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసింది.

    ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం

    ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం

    సైరా నరసింహా రెడ్డి సినిమాపై ఓవర్సీస్‌ మార్కెట్ లో డాలర్ల వర్షం కురుస్తోంది. విడుదలైన రోజు నుంచే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటిదాకా 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపింది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ.

    గిఫ్ట్ ఇచ్చి గురిపెట్టిన రామ్ చరణ్

    చిరంజీవి కెరీర్ పరంగా చూస్తే ఓవర్సీస్‌ మార్కెట్ లో 2.5 మిలియన్ డాలర్స్ రాబట్టిన మొదటి సినిమా సైరా నరసింహా రెడ్డి. ఇటు దేశంలో కూడా జోష్ కొనసాగిస్తూ రికార్డుల సునామీ సృష్టిస్తోంది సైరా. దీంతో తండ్రికి గిఫ్ట్ ఇచ్చి బాక్సాఫీస్‌కి భలే గురి పెట్టాడు రామ్ చరణ్ అని చెప్పుకుంటున్నారు జనం.

    కొరటాల సినిమా కోసం రెడీ

    కొరటాల సినిమా కోసం రెడీ

    సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు మెగాస్టార్. సందేశాత్మక చిత్రాల కింగ్ కొరటాల శివతో ఇటీవలే సినిమా ప్రారంభించేశారు. ఈ సినిమాలో కూడా చిరు, గతంలో ఎన్నడూ చేయని రోల్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got possitive talk. So this movie gets huze collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X