మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. సైరాకు గుమ్మడి కాయ కొట్టేశారట..

ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీ తర్వాత వస్తున్న రెండో చిత్రం సైరా నర్సింహారెడ్డి. స్వాత్రంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న సైరా చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికిపైగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నది.

సైరా సినిమా షూటింగ్‌లో గుమ్మడి కాయ కొట్టినట్టు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్టర్‌లో స్పందించారు. సైరా షూటింగ్ ముగిసింది. సైరా పూర్తి కావడానికి సహకారం అందించిన, హార్డ్‌ వర్క్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులంతదరికీ నా థ్యాంక్స్. సైరా చిత్రీకరణ నా జీవితంలో మరిచిపోలేని మెమొరీ అని రత్నవేల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chiranjeevis Sye Raa Narasimha Reddy shoot finishes

'సైరా నరిసింహారెడ్డి' చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్నివిడుదల కాబోతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

సైరా చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇండస్ట్రీ రికార్డులు తిరుగరాసే అవకాశం ఉందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X