వినాయక చవితి కానుక.. సైరా నుంచి సర్‌ప్రైజింగ్ లుక్
దేశమంతా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటోంది. ప్రతీ ఇంట, ప్రతీ వీధిలో గణనాథుడు కొలువు దీరుతున్నాడు. అలాంటి ఈ పర్వదినాన మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ 'సైరా నరసింహా రెడ్డి' నుంచి మెగా పోస్టర్ రిలీజ్ చేసింది సైరా టీం. ఈ మేరకు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సర్‌ప్రైజింగ్ లుక్‌లో తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి ఆకట్టుకుంటున్నాడు. ఆ నాటి జ్ఞాపకాలను నెమరు వేసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. గూడూరు గడ్డం, ఒత్తయిన జుట్టుతో మెగాస్టార్ లుక్ అదిరింది. కేవలం చిరంజీవిని మాత్రమే ఫోకస్ చేస్తూ వదిలిన ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదే పోస్టర్ షేర్ చేసుకుంటూ పెద్ద ఎత్తున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.

సైరా నరసింహా రెడ్డి కథ 1857 బ్రిటిష్ కాలం నాటిది కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











