Sye Raa Trailer 2: ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ప్రాణానికి లక్ష్యం ఒక్కటే..

Recommended Video

Sye Raa Trailer 2 (Telugu)

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ మేరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ మరింత ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా సైరా చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

యుద్ధ భూమిలో విప్లవ వీరుడు

యుద్ధ భూమిలో విప్లవ వీరుడు

సైరా ది బాటిల్ ఫీల్డ్ అంటూ రెండో ట్రైలర్ విడుదల చేశారు. యుద్ధ భూమిలో కదం తొక్కిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తాలూకు సన్నివేశాలు ఈ ట్రైలర్ లో చూపించారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదురొడ్డి కదనరంగంలో కట్టి పట్టిన ఉయ్యాలవాడ వీరుడి ఉగ్ర రూపం చూపుతూ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశారు.

అది మనది.. మన ఆత్మగౌరవం అంటూ

అది మనది.. మన ఆత్మగౌరవం అంటూ

బ్రిటిష్ వాళ్ళు భారత దేశ ప్రజలపై భారం వేస్తూ దేశ సంపద దోచుకోవడాన్ని ఈ ట్రైలర్ లో మొదట చూపించారు. ఆ తరువాత అది మనది.. మన ఆత్మగౌరవం అంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి కదనరంగం లోకి దూకడం హైలైట్‌గా ఉంది.

గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు

గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు అంటూ ఉయ్యాలవాడ వీరుడు చూపిన ధైర్యం, చేసిన పోరాటం తాలూకు సీన్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. చివరగా ''ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ప్రాణానికి లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్య్రం.. స్వాతంత్య్రం.. స్వాతంత్య్రం'' అంటూ ఉరికంభం ఎక్కుతూ ఉయ్యాలవాడ వీరుడు చూపిన పోరాట స్ఫూర్తి ప్రేక్షకుల రొమ్ములు నిక్కబొడిచేలా చేస్తోంది.

ప్యాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల్లో ఆతృత

ప్యాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల్లో ఆతృత

సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగు సహా పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా సైరా పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆడియన్స్ అంతా సైరా విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఒక్క హిందీ భాష లోనే ఈ రేంజ్

ఒక్క హిందీ భాష లోనే ఈ రేంజ్

ఇక సైరా నరసింహా రెడ్డి డిమాండ్ చూసిన మేకర్స్ ఒక్క హిందీ భాషలోనే దాదాపు 1500 స్క్రీన్స్‌పై భారీ రేంజ్‌లో ఈ సినిమా విడుదల చేయబోతున్నారట. బాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ సత్తా చూపాలనే కోణంలో అక్కడ ప్రమోషన్స్ పరంగా కూడా దూకుడుగా వ్యవహరించనుందట సైరా యూనిట్.

ఇదీ సైరా రేంజ్ అంటే..

ఇదీ సైరా రేంజ్ అంటే..

విడుదలకు ముందే సైరా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఓ రేంజ్ బిజినెస్ చేసి రికార్డు నెలకొల్పింది సైరా. పైగా ఇప్పటికి వరుకు లేని విధంగా 5 భాషల్లో విడుదల కాబోతున్న తెలుగు సినిమా 'సైరా'నే కావడం విశేషం. దీంతో సైరా రేంజ్ ఏంటో ఇప్పుడే తెలుస్తోంది.. ఇక సినిమా విడుదల తరువాత సంచలనాలు ఊహించగలమా! అంటున్నారు విశ్లేషకులు.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X