ఇరగదీస్తున్న 'సైరా' ట్రైలర్.. టాప్‌లో ట్రెండింగ్.. రికార్డుల సునామీ సృష్టిస్తూ!
చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ తాజాగా విడుదలైన ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.

సోషల్ మీడియాలో సైరా హంగామా
రోమాలు నిక్కబొడిచేలా ఉన్న 'సైరా నరసింహా రెడ్డి' ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే 20 లక్షల వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్.. ఇప్పటివరకు 50 లక్షల వ్యూస్ దాటేసి పరుగులు పెడుతోంది. సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది.
యూ ట్యూబ్‌లో ట్రెండింగ్.. వైరల్
సైరా ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ లో ఉందీ ట్రైలర్. ''ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము.. నీకెందుకు కట్టాలిరా శిస్తు'' అంటూ ట్రైలర్‌లో కనిపించిన డైలాగ్స్ ప్రేక్షకులకు రక్తి కట్టిస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ 5 మిలియన్ల వ్యూస్, 319 K లైక్స్‌తో హంగామా చేస్తోంది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ
తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ర్యాంక్‌లో ఉండటం విశేషం. కేవలం ఫ్యాన్స్‌నే కాకుండా సగటు ప్రేక్షకుడి చేత కూడా జై కొట్టించుకుంటోంది సైరా ట్రైలర్. దీంతో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

వరల్డ్‌వైడ్‌గా భారీ రెస్పాన్స్
మరోవైపు 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.

సైరా నరసింహా రెడ్డి విశేషాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











