Waltair Veerayya కు చంద్రబాబు ఎఫెక్ట్.. వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌కు బ్రేక్.. చిరంజీవి ప్లాన్ బీ!
సంక్రాంతి బరిలో దిగిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు ఏపీ ప్రభుత్వ అధికారుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒంగోలు, వైజాగ్‌లో ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు భారీగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అయితే ఈ రెండు చిత్రాల వేడుకలపై అధికారులు ఆంక్షలు విధిస్తూ వేదికలు మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విషయానికి వస్తే.. ఇప్పటికే ఒంగోలు ఏబీయం గ్రౌండ్ నుంచి అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌కు మార్చిన విషయం తెలిసిందే.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక నిర్మాణ పనులను ప్రభుత్వ అధికారులు అడ్డుకొన్నారు. దాంతో ఈ వేదిక, ప్రాంగణం వద్ద బారికేడ్ల నిర్మాణం పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు సమాచారం.

గత రెండు, మూడు రోజులుగా విస్తృతంగా వేదిక ఏర్పాటు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పనులను నిలిపి వేయాలని నిర్వాహకులకు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈవెంట్ నిర్వహణకు అధికారులు అనుమతులిస్తారా? లేదా అనే అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వైజాగ్‌లో అనుమతి ఇవ్వకపోతే.. ప్రత్యామ్నాయ వేదిక కోసం నిర్మాతలు, చిత్ర యూనిట్ కసరత్తు చేస్తున్నారు.
ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా కందుకూరు, ఇతర ప్రాంతాల్లో జరిగిన అపశృతులను దృష్టిలో పెట్టుకొని జారీ చేసిన జీవో నంబర్ 1 కారణంగానే అనుమతులు నిరాకరించినట్టు తెలుస్తున్నది. తాజాగా జారీ చేసిన జీవో ఎఫెక్ట్ కారణంగానే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుమతులు నిరాకరించినట్టు సినీ, రాజకీయ, ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











