twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్.. నా వెనుక లక్షలాది మంది.. చిరంజీవి భావోద్వేగం

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. భారీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. అనుకొన్న సంఖ్య కంటే.. పది రెట్లు ఫ్యాన్స్ పోటెత్తారు. అయితే ఈవెంట్ జరుగుతుండగానే.. భారీ వర్షం కురిసింది. వర్షాన్ని లెక్క చేయకుండా.. సిబ్బంది గొడుగు పడుతున్నా.. వద్దని వారించిన మెగాస్టార్ ఎమోషనల్‌గా మాట్లాడారు. మెగాస్టార్ మాట్లాడుతూ..

    Chiranjeevi

    భారీ వర్షం కురిసినా కదలకుండా ఉన్నారంటే.. అది నాపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా అనిపిస్తున్నది. రాయలసీమలో వర్షం పడక నేల నెర్రులు చాస్తుంటే.. చిరంజీవి వచ్చాడు.. వర్షం వస్తుంది అనే విషయాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నాను. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తానా రానా అనే మీమాంసలో ఉన్నాను. మధ్యాహ్నం వరకు వైజాగ్‌లో షూటింగ్ చేశాను. ఆ తర్వాత ఫ్లయిట్ తీసుకొని రావాలని అనుకొన్నాను. కానీ ఫ్లయిట్ రెండు మూడు గంటలు ఆలస్యమైంది. దాంతో నేను వస్తానా లేదా అనే అనుమానం కలిగింది. కానీ ప్రేమ బలీయమైంది కాబట్టే మీ వద్దకు వచ్చాను. మీ మనసుకు చేరువయ్యాను. అందుకే నేను మీకు శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను అని చిరంజీవి అన్నారు

    భారీ వర్షం పడుతున్నా మిమ్మల్ని వదిలి వెళ్లడానికి మనసు ఒప్పడం లేదు. ఇక్కడే ఉండాలని అనిపిస్తున్నది. ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడిచాను. చాలా ఆనందంగా ఉంది. ఆహ్లాదంగా ఉంది. థ్యాంక్యూ. మీకు ఒక విషయం నా హృదయం లోపలిని నుంచి చెప్పాలని అనుకొంటున్నాను. నేను ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతీ అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్. చిరంజీవికి ఎవరు గాడ్ ఫాదర్ లేరంటే.. ఒప్పుకోను. నా వెనుక లక్షలాది మంది గాడ్ ఫాదర్. నా మనసు అంతరాల్లో నుంచి వచ్చిన మాట. థ్యాంక్యూ సోమచ్ అని భావోద్వేగానికి గురయ్యారు.

    English summary
    godfather pre release event photos: Chiranjeevi's GodFather movie is coming on October 5th. Part of the promotion, Pre release event is organised at Ananthapur's ANP Arts College Ground. Here is the Chiranjeevi's emotional speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X