twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ కార్మికుల కోసం చారిటీ.. ఎవరెవరు ఎంతిచ్చారో, ఏం చేయబోతున్నారో చెప్పిన మెగాస్టార్

    |

    తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలబడ్డాడు చిరంజీవి. స్వర్గీయ దాసరి నారాయణ రావు కాలం చెల్లిన తరువాత పెద్దన్న పాత్రను ఎవ్వరూ పోషించలేకపోతున్నారు. సరైన సమయానికి స్పందించి.. సాయం కోరి తలుపు తడితే క్షణాల్లో చేసే దాసరి లోటు విస్పష్టంగా కనిపిస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం పెద్దన్న పాత్రను పోషించేందుకు ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉన్నాడు.

    పెద్ద దిక్కుగా చిరు..

    పెద్ద దిక్కుగా చిరు..


    ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చిరంజీవినే పెద్ద దిక్కుగా చాలామంది నమ్ముతున్నారు. అందుకే చిన్న సినిమాల నిర్మాతలు ఆయన వైపే చూస్తున్నారు. ఆయన చేయి వేస్తే చిన్న సినిమా రేంజ్ మారుతుందని అందరూ భావిస్తున్నారు. ఆయన కూడా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరిని సరి సమానంగా చూస్తూ పెద్ద దిక్కుగా నిలబడుతున్నాడు.

    కోటి రూపాయల విరాళం..

    కోటి రూపాయల విరాళం..

    కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో సినీ కార్మికుల పరిస్థితి దిక్కు తోచని స్థితిలోకి వెళ్లింది. అలాంటి సమయంలో మొదటగా స్పందించి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. సినీ కార్మికుల అవసరాల కోసం వాడాలని చెబుతూ ఆ మొత్తాన్ని చిత్ర పరిశ్రమకు అందించాడు.

    వెల్లువెత్తిన విరాళాలు..

    వెల్లువెత్తిన విరాళాలు..


    చిరు మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో విరాళాలు వెల్లువెత్తాయి. దగ్గుబాటి ఫ్యామిలీ కోటి రూపాయాలు, నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, రామ్ చరణ్ 30 లక్షలు విరాళంగా ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నాడు.

    Recommended Video

    Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani

    కరోనా క్రైసిస్ చారిటీ..

    కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకే కరోనా క్రైసిస్ చారిటీని ప్రారంభిస్తున్నట్టు చిరు పేర్కొన్నాడు. ఈ చారిటీలో ఇప్పటి వరకు 3.8కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపాడు. సినీ పరిశ్రమలో ఉన్న దినసరి కూలీలు, పేద కళాకారులకు, షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ చారిటీ సాయంగా నిలబడుతుందని తెలిపాడు.

    English summary
    Chiranjeevi Setup Corona crisis Charity To Help Cine Workers. To aid the Film workers especially the daily wage earners who need most support in the industry at this time, we have set up CoronaCrisisCharity (CCC).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X