అప్పటి నుంచే బాబాయ్ అడుగు జాడల్లో..రామ్ చరణ్‌పై చిరు కామెంట్స్
చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దుమ్ములేపుతున్నాడు. సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వాడేసుకుంటున్నాడు. అది ఇది అని తేడా లేకుండా వాళ్లు వీళ్లు అని తారతమ్యం లేకుండా అందరికీ కౌంటర్స్ ఇచ్చి పడేస్తున్నాడు. చిరు టైమింగ్‌కు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. నిన్న ఆర్ఆర్ఆర్ గురించి రాజమౌళి-చిరు సంభాషణ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇలా సోషల్ మీడియాను ఇంత కాలం వాడలేదన్న బాధతో ఉన్నాడో ఏమో గానీ.. ఉగాది నాడు మొదలైన ఈ దూకుడు అలా కొనసాగుతూనే ఉంది. ట్వీట్లతో నెటిజన్లకు కావాల్సినంత ఫన్‌ను ఇస్తున్నాడు, ఇక మెగా ఫ్యాన్స్ అవసరమైనంత కిక్ ఇస్తున్నాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న నాటి విశేషాలను షేర్ చేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపాడు.

రామ్ చరణ్ పుట్టినప్పుడు తెలియకుండానే ఉప్పొంగిపోయానని, ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడే ఎందుకు పుట్టాడో తనకు అర్థం కాలేదని, దానికీ ఓ కారణం ఉండే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇలా వ్యక్తిగత విశేషాలను చెబుతూ.. ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపుతున్నాడు. పంచ్ డైలాగ్‌లతో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఆ వయసు నుంచే బాబాయ్ అడుగు జాడల్లో నడవటం మొదలు పెట్టాడంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇక ఈ పిక్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











