గుడ్ న్యూస్ చెప్పిన కల్యాణ్ దేవ్... జస్ట్ వెడ్డింగ్ అంటూ పోస్ట్

కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్... ఆ మధ్య వీరు విడిపోయినట్లు వార్తలు అయితే వచ్చాయి. ఇప్పటికీ వీరు వేరు వేరుగానే ఉంటున్నారు. ఇక కల్యాణ్ దేవ్ పలు సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కల్యాణ్ దేవ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

చిరంజీవి చిన్నకూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని.. కొంతకాలం పాటు అతనితో ఫ్యామిలీలైఫ్ గడిపింది. వీరికి బిడ్డ కూడా పుట్టింది. అయితే అతనితో మనస్పర్థల వల్ల అతనికి విడాకులు ఇచ్చేసింది శ్రీజ. ఆ తర్వాత చిరంజీవి సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Chiranjeevi Son in Law Kalyan Dhev Just Wedding Post Viral

శ్రీజ కళ్యాణ్ దేవ్ లు కొన్నాళ్లు బానే ఉన్నారు. వీరికి కూడా ఓ కుమార్తె జన్మంచింది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చి గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నట్టు గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వారు వేరువేరుగానే ఉంటున్నట్లు వాళ్లు తరుచుగా పెడుతున్న పోస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఈ టైమ్‌లో కళ్యాణ్ దేవ్, శ్రీజ ఏ పోస్ట్ చేసినా కూడా పెద్ద హాట్ టాపిక్ అవుతుంది.

ఆ మధ్య శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారని.... శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమవుతుందని రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ అయితే లేదు.. కానీ వీటిపై ఇరువురు కుటుంబాలు సైలెంట్ గానే ఉంటున్నాయి. కేవలం సోషల్ మీడియాలో ఖాతాలను పరిశీలిస్తే మాత్రం వీరిద్దరు విడివిడిగా ఉన్నట్లుగా అర్థం అవుతుంది. మొదటగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి విడాకుల ప్రచారం మొదలు అయింది.

Chiranjeevi Son in Law Kalyan Dhev Just Wedding Post Viral

కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి. మొన్నటి వరుణ్ తేజ్ వివాహానికి కూడా అతను హాజురు కాలేదు. ఇక అటు సినిమాల్లో కూడా కనిపించడం లేదు కల్యాణ్ దేవ్. దర్శక,నిర్మాతలు మెగా హీరోలకు భయపడే ఇతనికి దూరంగా పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కల్యాణ్ దేవ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

జస్ట్ వెడ్డింగ్ అంటూ కల్యాణ్ దేవ్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో వేరే వాళ్లు ఎవరో పెళ్లి చేసుకున్నారు. ఆ జంట పెళ్లికి కల్యాణ్ హాజరు అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోటోలను పోస్ట్ చేసి.. జస్ట్ వెడ్డింగ్ అంటూ రాసుకువచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X