Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త మూవీ నుంచి అసలైన అప్‌డేట్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ.. టాప్ హీరోగా దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం చిరంజీవి మరింత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తోన్నారు. ఇలా గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే టాప్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి ఇప్పటికే తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' చిత్రంలో నటిస్తోన్నారు. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా మిగిలిపోయిన మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ అదిరే అప్‌డేట్ వచ్చింది.

'భోళా శంకర్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టింది. ఈ మేరకు నిర్మాతల కార్యాలయంలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసిన మూవీ టీమ్.. డబ్బింగ్ పనులు ప్రారంభం అయినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ అయిన షూటింగ్ మొత్తానికి ముందుగా డబ్బింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. దీనిబట్టి ఈ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తారని చెప్పొచ్చు.
క్రేజీ కాంబోలో వస్తున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలిసింది.


Click it and Unblock the Notifications











