Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్ ఇక డౌట్స్ వద్దమ్మా.. బాస్ ముందే కొట్టేశాడు
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో ఆరంభంలోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుని స్టార్‌గా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తోన్న ఆయన.. రీఎంట్రీలో ఎవరూ ఊహించని రీతిలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో అలరించారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే చిరంజీవి ఇప్పుడు 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తోన్నారు.
చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీని స్టార్ట్ చేసేశారు. దీన్ని చాలా గ్యాప్ తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టిన మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఒక్క హిట్ కొట్టని ఈ డైరెక్టర్.. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం చిరంజీవి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను వదిలారు.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తి అయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేశ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు, చిరంజీవితో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ పోస్టులో 'భోళా శంకర్ షూటింగ్ కంప్లీట్ అయింది. రాత్రి పగలు తేడా లేకుండా ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి నటీనటులకు, టెక్నీషియన్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి' అని చెప్పుకొచ్చాడు. ఇక, చిరంజీవి ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక, 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











