Viswambhara: విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ సెంటిమెంట్ ప్రకారం చిరంజీవికి హిట్టే
టాలీవుడ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతూనే ఉన్నారు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆ తర్వాత రీఎంట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఇలా ఈ మధ్య కాలంలోనే చిరంజీవి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది కూడా రెండు చిత్రాలను చేశారు.
'భోళా శంకర్' డిజాస్టర్‌తో ఢీలా పడిన చిరంజీవి.. ఇప్పుడు తన 156వ సినిమాగా 'విశ్వంభర'ను చేస్తున్నాడు. దీన్ని 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో పంచ భూతలు అనే కాన్సెప్టుతో ఇది తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.
హై రేంజ్ విజువల్స్‌తో రాబోతున్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఈరోజు నుంచే కొత్త షెడ్యూల్ ప్రారంభించగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. దీంతో దీనిపై దేశ వ్యాప్తంగా హైప్ ఏర్పడింది. అదే సమయంలో ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే తెలిసింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీ 2025, జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో చిరంజీవిని డార్క్ షేడ్‌లో చూపించారు. ఇక, రీఎంట్రీలో ఆయన చేసిన 'ఖైదీ నెంబర్ 150', 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికి వచ్చి సక్సెస్ అయ్యాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం.. 'విశ్వంభర' కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











