Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవితో పవన్ కళ్యాణ్.. 24ఏళ్ళ క్రితం పూనకాలు తెప్పించిన స్టైలిష్ స్టిల్!
మెగా ఫ్యామిలిలో స్టార్స్ ఎంత మంది ఉన్నా కూడా జనాల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. మెగాస్టార్ వేసిన బాటలో వచ్చినప్పటికీ ఎవరికి వారు బలమైన మార్కెట్ తో ఇండస్ట్రీలో గట్టిగానే స్థిరపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక 24 ఏళ్ళ క్రితం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న ఒక స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సరికొత్త ట్రెండ్ సెట్ చేసుకుంటూ
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక విలన్ పాత్ర నుంచి ఆ తరువాత హీరో స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా పైకొచ్చిన చిరంజీవి సినిమా సినిమాకు సరికొత్త ట్రెండ్ సెట్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు. ఇక మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ మ్యాజిక్కే వేరు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉండే అనుబంధంపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా బ్రదర్స్ రిలేషన్ లో ఉండే ఆ మ్యాజిక్కే వేరు. వారిద్దరు సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు పండగే. అన్నయ్య మెగాస్టార్ తో తమ్ముడు పవర్ స్టార్ కనిపిస్తే ఆ వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు.
పునకాలు తెప్పించిన స్టిల్
ఇక 24 ఏళ్ళ క్రితం కూడా ఒక ఫొటో అభిమానులకు పునకాలు తెప్పించింది. ఒకప్పుడు ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ లో మన సినిమా తారల ఫొటోలు పడటం చాలా రేర్. ఇక 1997లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు సంబంధించిన ఒక స్పెషల్ స్టిల్ అందరిని ఆకట్టుకుంది. ఆ ఒక్క స్టిల్ అప్పట్లో అభిమానులకు ఎంతగానో నచ్చింది. భారీ స్థాయిలో మ్యాగజైన్ లు అమ్ముడు పోయాయి కూడా.
Recommended Video
మల్టీస్టారర్ అనుకున్నారు.. కానీ..
ఇక చాలా రోజుల అనంతరం ఈ ఫొటోను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాలని సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎందుకో ప్రాజెక్ట్ అయితే సెట్టవ్వలేదు. మరి భవిష్యత్తులో అయినా ఈ కాంబో సెట్టవుతుందో లేదో చూడాలి.