చిరంజీవి ఓటు ఆ హీరోయిన్‌కే: ‘లూసీఫర్’లో భాగం కాబోతున్న టాలెంటెడ్ బ్యూటీ
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఇప్పుడు బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది ఇంకా షూట్‌ను కంప్లీట్ చేసుకోక ముందే పలువురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో చిరంజీవి చేయబోతున్న చిత్రాల్లో 'లూసీఫర్' రీమేక్ ఒకటి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడిదే మూవీని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించనున్నాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నయనతార పేరును సూచించారట చిరు. దీంతో డైరెక్టర్ ఆమెతో సంప్రదింపులు జరపగా.. డేట్స్ సర్ధుబాటు చేయలేని విషయాన్ని చెప్పిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోసం వెయిట్ చేద్దామన్న ధోరణిలో ఉందట చిత్ర యూనిట్.

వాస్తవానికి 'లూసీఫర్' రీమేక్‌లో నయనతార చిరంజీవి చెల్లెలి పాత్ర చేయబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత హీరోయిన్‌గా చేస్తుందని అన్నారు. కానీ, ఇంకా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తాజాగా తెలిసింది. ఇదిలా ఉండగా.. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు మూడో వారం నుంచి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. దీన్ని రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











