నందమూరి హీరోకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చిరంజీవి.. అసలు విషయం తెలిస్తే!
ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత ఎన్నో చిత్రాలతో వచ్చిన ఆయన.. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. భారీ అంచనాలతో వచ్చిన దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా అత్యధిక కలెక్షన్లను సాధించిన ఈ సినిమా.. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా రికార్డులు సాధించింది.
'వాల్తేరు వీరయ్య' విజయంతో మాంచి ఊపులో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే తన కొత్త చిత్రం 'భోళా శంకర్' మూవీని కూడా పున: ప్రారంభించారు. ఆయన ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టడంతో పాటు చకచకా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఇక, ఇదే ఊపులో చిరంజీవి మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టారని ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. నందమూరి హీరో కల్యాణ్ రామ్‌కు 'బింబిసార'తో హిట్ ఇచ్చిన మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారట. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారన్న వార్త ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుంచి వీళ్లిద్దరి కాంబినేషన్‌పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో తాజాగా దీనిపై మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది.
దీని ప్రకారం.. అసలు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం లేదని తెలిపింది. ఇటీవలే మల్లిడి వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవిని కలిశాడట. కానీ, అది అతడి వ్యక్తిగత పని మీద అని అంటున్నారు. అయితే, ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం రామ్ చరణ్ కోసం ఓ స్టోరీని రెడీ చేస్తున్నట్లు మరో న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే ఆయన మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ సహా ఎంతో మంది దర్శకులతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











