Don't Miss!
- News
జగన్ తో కొత్త సీఐడీ ఛీఫ్ సంజయ్ భేటీ- తన ప్రయారిటీ చెప్పేసిన సీఎం..
- Sports
IND vs NZ: శతక్కొట్టిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం!
- Lifestyle
సృజనాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండేలా పిల్లలను ఇలా పెంచండి
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Finance
Jio 5G: కొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- Technology
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Viswasam Remake: చిరంజీవి కొత్త సినిమాపై ట్విస్ట్.. ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్ న్యూసే!
ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లుకు ధీటుగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. ఇప్పటికే చాలా సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా అత్యధిక కలెక్షన్లను సాధించిన ఈ సినిమా.. వారం రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!
'వాల్తేరు వీరయ్య' విజయం అందించిన జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే తన కొత్త చిత్రం 'భోళా శంకర్' మూవీని కూడా పున: ప్రారంభించారు. ఆయన ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, ఇదే ఊపులో చిరంజీవి మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టారని ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'విశ్వాసం' మూవీని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో తాజాగా దీనిపై మెగా టీమ్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది.

వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వాసం' సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మెగా అభిమానులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రీమేక్ సినిమాలు చేయొద్దని మెగాస్టార్‌ను రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా మెగా టీమ్ 'విశ్వాసం' రీమేక్ వార్తలను ఖండించింది. అంతేకాదు, ఆయన అలాంటి ఆలోచన కూడా చేయలేదని, అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలే జరగలేదని ఈ స్టార్ హీరో సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!
చిరంజీవి ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ కూడా కీలక పాత్రను చేసిన ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించాడు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిరంజీవి కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లను సాధించే దిశగా ఇది సాగుతోంది.