గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి: జన జాగృతి పార్టీ కోసం రంగంలోకి.. సంచలనంగా మారిన ఫొటోలు

అరవై ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి వెనుదిరిగి చూడడం లేదు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి ఏకకాలంలో పలు చిత్రాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. అంతేకాదు, చిరంజీవికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ సంగతులు మీకోసం!

ఆచార్యగా రెడీగా ఉన్న చిరంజీవి

ఆచార్యగా రెడీగా ఉన్న చిరంజీవి

రీఎంట్రీలో జెట్‌ స్పీడుతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది.

వరుసగా సినిమాలు.. ఫుల్ జోష్‌తో

వరుసగా సినిమాలు.. ఫుల్ జోష్‌తో

'ఆచార్య' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మరిన్ని చిత్రాలను మొదలు పెట్టేశారు. అందులో ఒకటి తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ ఒకటి కాగా.. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తోన్న మూవీ మరొకటి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు కూడా మొదలైన విషయం తెలిసిందే.

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్‌లో.. మరో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదలైంది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే చిరంజీవి 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.

ఫుల్ బిజీగా చిరు.. కోవిడ్ పాజిటివ్

ఫుల్ బిజీగా చిరు.. కోవిడ్ పాజిటివ్

ఈ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'డియర్ ఆల్.. గత రాత్రి చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఈ వైరస్ సోకింది' అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కరోనా నుంచి కోలుకున్న చిరు

కరోనా నుంచి కోలుకున్న చిరు

కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి... తన నివాసంలోనే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. 'కరోనా నెగెటివ్ వచ్చింది. నేను కోలుకోవాలని కోరుకున్న వాళ్లందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను' అని పేర్కొన్నారు.

మళ్లీ వర్క్ మొదలెట్టిన స్టార్ హీరో

మళ్లీ వర్క్ మొదలెట్టిన స్టార్ హీరో


కరోనా నుంచి కోలుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన పనిని మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే ఆయన ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా వెల్లడించారు. అంతేకాదు.. షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అందులో సత్యదేవ్, సునీల్ తదితర నటులు కనిపించారు.

జన జాగృతి పార్టీ ఫోటోలు లీక్

జన జాగృతి పార్టీ ఫోటోలు లీక్

'గాడ్ ఫాదర్' మూవీ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. ఇక, తాజాగా బయటకు వచ్చిన ఫొటోల్లో చిరంజీవి 'జన జాగృతి పార్టీ'కి చెందిన నేతగా కనిపించనున్నట్లు తెలిసింది. దీంతో ఈ పిక్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అదే సమయంలో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X