హైదరాబాద్‌లో జనతా హాస్పిటల్ నిర్మాణం.. చిరంజీవి భవిష్యత్ ప్లాన్స్ వింటే షాక్ అవ్వాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ఎవరైనా సహాయం కోసం ఆర్థిస్తే.. వెంటనే స్పందించి తనదైన శైలిలో సహాయం చేయడం చిరంజీవి నైజం. గత కొన్నేళ్లుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహణలో దేశంలోనే గొప్ప పాత్రను పోషిస్తున్నారు. అలాగే కరోనా సమయంలో పేద ప్రజలకు ఆక్సిజన్ ప్లాంట్స్ అందించి తనదైన శైలిలో స్పందించారు. అలాగే పేద ప్రజలు, పేద సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు అండగా నిలుస్తూ తనలోని దాతృత్వాన్ని చాటుకొంటున్నారు. అయితే సినిమా పరిశ్రమలోని వారికి సహాయం అందించేందుకు చిరంజీవి బృహత్ ప్రణాళికను సిద్దం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆచార్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన భవిష్యత్ ప్రణాళికలపై క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 10 పడకలతో హాస్పిటల్ నిర్మాణానికి సిద్దమవుతున్నాం. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికుల కోసం త్వరలోనే జనతా హాస్పిటల్‌ను నిర్మిస్తాం. తనకు ఎంతో ఇచ్చిన ఈ సినిమా పరిశ్రమ కోసం చంద్రుడికో నూలుపోగు మాదిరిగా నా వంతుగా ఎంతో కొంత వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకొన్నాం అని చిరంజీవి అన్నారు.

ఇక నటుడిగా నేను సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. భవిష్యత్‌లో డైరెక్షన్ చేయాలనేది నా కోరిక. అది చిరకాలంగా నా మదిలో ఉన్న కల. సరైన సమయంలో నేను సినిమాకు దర్శకత్వం చేస్తాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా యాక్టింగ్‌పైనే. టైమ్ పర్మిట్ చేస్తే... దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను అని చిరంజీవి తన మనసులోని మాటను చెప్పారు.
ఆచార్య సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. దైవం మానుష్య రూపేణ.. ఈ సినిమాలో నక్సలైట్ రూపేణా అంటూ ఒక్క మాటలో సినిమా కథను వివరించారు. ఓ టెంపుల్ టౌన్‌లో ఉండే యువకుడు అడవిలో నక్సలైట్‌గా ఎలా మారారు. అడవిలో ఉండాల్సిన నక్సలైట్ టెంపుల్ టౌన్‌కు ఎందుకు వచ్చాడనే పాయింట్‌పై ఆచార్య చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications











