చిరంజీవి చేతుల మీదుగా విశ్వ నటచక్రవర్తి విగ్రహావిష్కరణ.. తాడేపల్లిగూడెంలో..

తెలుగు తెరపై రాణించి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని దక్కించుకొన్న నటుడు దివంగత ఎస్వీ రంగారావు. ఆయన నటించిన పండంటి కాపురం, కత్తుల రత్తయ్య, భలేపాప లాంటి పలు చిత్రాలు ఆణిముత్యాలుగా నిలిచాయి. డైలాగ్‌ డెలీవరీలోను ఆయన తనదైన శైలితో ఆకట్టుకొన్నారు. ఇప్పటికీ, ఈ తరం వారికి కూడా ఆయన సినిమాలు మెప్పిస్తున్నాయి. అలాంటి ఉన్నతమైన నటుడిని సేవలను స్మరించుకొనేందుకు ఓ అరుదైన గౌరవాన్ని అందించబోతున్నారు. ఆయన విగ్రహాన్ని తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించనున్నారు.

విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. ప‌ద్మ‌భూష‌ణుడు, మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించ‌నున్నారు. 6 అక్టోబ‌ర్ 2019 (ఆదివారం) ఉద‌యం 10.15 నిమిషాల‌కు తాడేప‌ల్లిగూడెం ఎస్వీఆర్ స‌ర్కిల్, కేయ‌న్‌రోడ్ లో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైరా:న‌ర‌సింహారెడ్డి ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో ప్ర‌చారకార్య‌క్ర‌మాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు విచ్చేస్తున్నందుకు నిర్వాహ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Chiranjeevi to unveil SV Ranga Rao Statue in Tadepallygudem

ఈ సంద‌ర్భంగా శ్రీ ఎస్వీ రంగారావు సేవాస‌మితి ప్ర‌తినిధులు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సైరా: న‌ర‌సింహారెడ్డి చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ఆనందంలో ఉన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా మెగాస్టార్ అద్భుతంగా న‌టించారు. ఐదు భాష‌ల్లో రిలీజైన సైరా విజ‌యం తెలుగు వారి స‌క్సెస్ గా భావిస్తున్నాం. ఒక గొప్ప చారిత్ర‌క విజ‌యం అందుకున్న‌ సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆయ‌న విచ్చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట కోసం క‌మిట్‌మెంట్‌తో మెగాస్టార్ ఈ ఆవిష్క‌ర‌ణ‌కు విచ్చేస్తున్నారు. ఓవైపు సైరా ప్ర‌చారంలో బిజీగా ఉండీ ఆయ‌న మాట‌కు క‌ట్టుబ‌డి విచ్చేయ‌డం సంతోషాన్నిస్తోంది. ఆదివారం ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి తాడేప‌ల్లి చేరుకుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. అటుపై తిరిగి మెగాస్టార్ హైద‌రాబాద్ కి విచ్చేస్తారు అని తెలిపారు.

కాగా సైరా నర్సింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయి.. రూ.100 కోట్ల మార్కును దాటేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ.150 కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X