For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bholaa Shankar కోసం చిరంజీవి ప్రయోగం: గతంలో ఎన్నడూ చూడని విధంగా!

  |

  పది కాదు.. ఇరవై కాదు.. దాదాపు నలభై సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ మెగాస్టార్.. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి సైతం ప్రవేశించారు. ఆ తర్వాత కొంత కాలానికి 'ఖైదీ నెంబర్ 150' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే చిరు.. మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

   Chiranjeevi Two Different Looks for Bholaa Shankar

  చిరంజీవి ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాల్లో 'భోళా శంకర్' ఒకటి. దీనికి కారణం ఈ మూవీని ఫ్లాప్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండడమే. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా ప్రముఖ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక, ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశాడట. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'భోళా శంకర్' మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్‌ లుక్స్‌తో కనిపించనున్నాడట. అందులో ఒకటి గుండు గెటప్ కాగా.. మరొకటి ఇప్పటి వరకూ కనిపించని విధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్‌ను ఎలాంటి పాత్రలో చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో.. అలాంటిదే మెహర్ రమేష్ డిజైన్ చేశాడని సమాచారం. అందుకే దీన్ని ఎక్కడా రివీల్ చేయకుండా సీక్రెట్‌గా ఉంచబోతున్నారట. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇది ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది.

  English summary
  Megastar Chiranjeevi will do Bholaa Shankar Movie with Director Meher Ramesh. Chiranjeevi Try Two Different Looks for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X