Waltair Veerayya: ఆ విషయంలో చిరంజీవి అసంతృప్తి.. అన్ని కోట్లు వేస్ట్ అంటూ!
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ కాలం పాటు ఎన్నో ఇండస్ట్రీలో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోన్న చిరంజీవి.. ఇప్పుడు'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో రాబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర రూపొందించిన ఈ మూవీలో మరో స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేశాడు.
బిగ్ మల్టీస్టారర్‌గా వస్తున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఛానెళ్లతో ఆయన చిట్ చాట్‌ను కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన కామెంట్‌ను కూడా చేశారాయన.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య మూవీ కోసం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. ఆ విషయం మీకు ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అయితే, బాస్ పార్టీ అనే సాంగ్ కోసం వాళ్లు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ సెట్‌ను వేశారు. కానీ, దాన్ని సరిగా ఉపయోగించారు అని మాత్రం నాకు అనిపించలేదు. ఈ విషయంలో నాకు అసంతృప్తిగా ఉంది. కేవలం అన్ని కోట్ల విలువైన సెట్‌ను ఒక పాట కోసమే వాడుకోవడం నిరాశకు గురి చేసింది' అని వివరించారు.
చిరంజీవి, రవితేజ హీరోలుగా వస్తున్న ఎంటర్‌టైనర్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











