చిరంజీవి-వెంకటేష్ మధ్య ఫైట్!.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర్ వరప్రసాద్ గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్, ఈసారి చిరంజీవితో ఎంటర్టైన్మెంట్ పండగ అందించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించగా, స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ షూటింగ్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే వెంకటేష్ పాత్ర గురించి వస్తున్న సమాచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
వెంకటేష్ కేవలం గెస్ట్ రోల్?
ఇప్పటి వరకూ వచ్చిన సమాచారం ప్రకారం చిరంజీవి.. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో గెస్ట్ రోల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే తాజా అప్‌డేట్‌ప్రకారం వెంకటేష్ పాత్ర కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే కాదు.. స్టోరీ నేరేషన్‌లో కీలకంగా ముడిపడిన రోల్ అని ఇండస్ట్రీ సర్కిల్స్ టాక్. రెండు స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా నిలవబోతుందని చర్చ కొనసాగుతోంది. అలాగే.. ఈ మూవీలోకి పలు కీలక అప్డేట్స్ పై కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా.. "ప్రేక్షకులు ఈ జానర్‌కి భారీ రెస్పాన్స్ ఇస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' ఘన విజయం అందరికీ తెలుసు. ఆడియన్స్ ఎంజాయ్ చేసే కంటెంట్ ఇస్తే వారు మనకు అండగా ఉంటారు. ఒకే రకమైన సినిమాలు చేస్తే మాత్రం ప్రేక్షకులు వదిలేస్తారు," అని అనిల్ వివరించారు. అలాగే, చిరంజీవి గారు ఈ తరహా పాత్రలో దాదాపు 25 ఏళ్లుగా కనిపించలేదు అని చెబుతూ.. ఇది న్యూఎజ్ పిల్లలకూ బాగా కనెక్ట్ అవుతారు. వారి కోసం ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాం" అని స్పష్టం చేశారు.
వెంకటేష్ పాత్ర గురించి ప్రశ్నించగా.. అనిల్ రావిపూడి సమాధానం ఇచ్చారు. "వెంకటేష్ గారు కేవలం గెస్ట్ రోల్. ఆయన ఎంట్రీకి ఉన్న బిల్డ్-అప్, స్క్రీన్‌పై రెండు స్టార్‌ల కెమిస్ట్రీ. ప్రేక్షకులను థియేటర్లో పండగ చేసుకునేలా చేస్తుంది" అని వివరించారు. రెండు హీరోలు కలిసి కనిపించే సీన్స్ మాస్ ఆడియన్స్‌కు అంతులేని ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తాయని, ఆ సన్నివేశాలను థియేటర్‌లోనే చెయ్యాల్సిన ఎంజాయ్‌మెంట్ అని చెప్పారు.
స్టోరీ సీక్రెట్ ఎందుకు లేదు?
డైరెక్టర్లంతా కథను సీక్రెట్ గా ఉంచే ట్రెండ్ మధ్య, అనిల్ ఇలా ఓపెన్‌గా చెప్పడం ఎందుకు అని ప్రశ్నించగా, అనిల్ స్పందన కూడా హిట్ అయ్యింది. " ఇది ధైర్యమేమీ కాదు... నిజాయతీ. మనం ఏ కథ చెబుతున్నాం? ప్రేక్షకులకు ముందుగానే చెప్పడం. వాళ్లకు ఈ విషయం నచ్చుతుంది. కథ బాగుంటే, దాన్ని ఎలా నడిపిస్తున్నాం అన్నదే ముఖ్యం. అప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు," అని అనిల్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయంటూ ప్రశ్నించగా.. డైరెక్టర్ అనిల్ హాట్ హైలైట్ షేర్ చేశారు. "మీసాల పిల్ల సాంగ్ ఎలా సెన్సేషన్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నాలుగు పాటలు ఉన్నాయి. అందులో చిరంజీవి - నాగార్జున కాంబినేషన్‌తో ఒక స్పెషల్ సాంగ్ ఉంది," అని ప్రకటించారు. తెలుగు సినీ అభిమానులకు ఈ కోణం పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇద్దరు స్టార్స్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్, హెలికాప్టర్ షూట్ ఇలా బజ్ క్రియేట్ అయింది. దీనిపై అనిల్ రావిపూడి రియాక్షన్ వైపు అందరి దృష్టి. "అది యాక్షన్ సీక్వెన్స్ కాదు... ఫన్ ఫైట్! హెలికాప్టర్లు ఉన్న విషయం నిజం. కానీ అది మెగా బ్లాస్టింగ్ ఫైట్ కాదు. ఆ సన్నివేశాలను థియేటర్‌లో చూసి ఆడియన్స్ ఫన్ ఎంజాయ్ చేయాలి" అని స్పష్టం చేశారు. ఈ ఒక్క కామెంట్ సినిమాపై అంచనాలు మరోస్థాయికి తీసుకెళ్ళింది.
అనిల్ రావిపూడి IFFI 2025లో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోలు, ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, సరదా ఫైట్, మ్యూజిక్ అన్నీ కలిసి 'మన శంకర్ వరప్రసాద్ గారు' సంక్రాంతి 2026లో పండగ హిట్ గా మారబోతుందని ఫ్యాన్స్ ఆశభావం వ్యక్తం చేస్తన్నారు. సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











