అది మన ధర్మం.. జనతా కర్ఫ్యూకు చిరంజీవి మద్దతు
కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ అనే నూతన కార్యక్రమాన్ని ప్రకటించింన సంగతి తెలిసిందే. ఈ కాన్సెప్ట్‌ను రేపు (మార్చి 22) ప్రజలెవరూ బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నిర్భందాన్ని విధించుకోవాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌పై విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. అందరికీ ఈ విధానం గురించి వివరించడని, ఆ రోజు ఎవ్వరూ కూడా బయటకు వెళ్లొద్దని ప్రజలకు ప్రధాని సూచించారు.
ఈ మేరకు జనతా కర్ఫ్యూ గురించి సినీ ప్రముఖులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, అమితాబ్, షాహిద్ కపూర్, మోహన్ లాల్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాని నిర్ణయానికి తన మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్ వీడియో బైట్ ద్వారా సందేశాన్ని పంపాడు.

తాజాగా చిరంజీవి తన మద్దతును తెలిపాడు. ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దామని పిలుపునిచ్చాడు. కరోనా సమయంలో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని ప్రశంసించాల్సిన సమయమిదన్నాడు. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్ర 9 గంటల వరకు ఎవ్వరూ బయటకు రావొద్దని, ఇంట్లోనే ఉండాలని తెలిపాడు. సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటకు వచ్చి మనకు సేవలందిస్తున్న వైద్య బృందానికి కరతాళ ధ్వనులు చేయాలతో ప్రశంసించాలి..అది మన ధర్మం అంటూ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











