కల్కి 2898 AD మిస్.. ఆ సెంటిమెంట్ తో విశ్వంభర

మిగతా సినీ ఇండస్ట్రీస్ లో ఏమో కానీ మన తెలుగు సినిమా దగ్గర కొన్ని అంశాలు మాత్రం చాలా పట్టించుకుంటారు. అలా కొన్ని కాంబినేషన్స్ విషయంలో కానీ పలు సినిమాలకి టైటిల్ లో ఎన్ని అక్షరాలు ఉండాలి ఆ సినిమా ఏ అక్షరంతో మొదలవుతుంది ఎలా ఉంటే హిట్ అవుతుంది. అలా చాలా కొలమానాలే మనవాళ్ళు వేసుకుంటారు.

ఇలా టాలీవుడ్ లో ఇప్పటికీ పలు సెంటిమెంట్స్ అయితే మన వాళ్ళు ఫాలో అవుతారు. మరి అలా హిట్ అయ్యినవి కూడా ఉన్నాయి ప్లాప్ అయ్యినవి కూడా ఉన్నాయి. అలా టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రం కల్కి 2898 ఎడి మేకర్స్ కూడా ఒక సెంటిమెంట్ ని గట్టిగా పట్టుకొని ఉన్నారు కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నికలు వచ్చి దెబ్బ తీశాయి.

chiranjeevi vishwambhara got kalki 2898 ad makers missed sentiment

కాగా కల్కి 2898 ఎడి సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు తీసిన చిత్రాల్లో మే 9 న వచ్చిన అన్ని సినిమాలు వారికి భారీ లాభాలు అందించి పెట్టాయి. దీనితో కల్కి ని కూడా అదే డేట్ లో తీసుకురావాలని చాలా ట్రై చేశారు కానీ అది సాధ్యపడలేదు. కాగా ఈ డేట్ సెంటిమెంట్ ని వారు మిస్ చేసుకున్నారు కానీ దానిని మెగాస్టార్ చిరంజీవి ఒడిసి పట్టుకుంటున్నట్టుగా సినీ వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ విజువల్ ట్రీట్ సినిమానే "విశ్వంభర". బింబిసార ఫేమ్ యువ దర్శకుడు వసిష్ఠ ఈ మెగా ప్రాజెక్ట్ ని టేకోవర్ చేయగా ఎప్పుడో ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 10 రిలీజ్ అంటూ చెప్పేసారు. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా విశ్వంభర తోనే మొదలైంది. కానీ గత కొన్నాళ్ల నుంచి ఈ డేట్ లో విశ్వంభర రాదు చిరు వారసుడి చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

chiranjeevi vishwambhara got kalki 2898 ad makers missed sentiment

కానీ సీన్ కట్ చేస్తే నిజంగానే ఇలా జరిగింది. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా కన్ఫర్మ్ అయ్యింది. మరి విశ్వంభర ఎప్పుడు అంటే.. కల్కి మేకర్స్ ఏదైతే సెంటిమెంట్ డేట్ ని మిస్ చేసుకున్నారో ఇదే డేట్ లో చిరు రాబోతున్నారట. కాగా వైజయంతి మూవీస్ తో చేసిన అప్పటి చిత్రం "జగదేక వీరుడు అతిలోక సుందరి" కూడా అదే డేట్ లో వచ్చింది.

కాగా ఇప్పుడు మళ్ళీ విశ్వంభర కూడా ఆ సినిమాలనే ఫాంటసీ జానర్ కావడంతో ఆ హిస్టరీ మళ్ళీ రిపీట్ చేసే రకంగా మెగాస్టార్ ప్లాన్ మార్చుకున్నట్టు గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. సో వారు మిస్ చేసుకున్న సెంటిమెంట్ ని చిరంజీవి సెట్ చేసుకున్నారని చెప్పొచ్చు. మరి చిరు నుంచి అపుడు వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మరి మళ్ళీ అదే సెంటిమెంట్ లో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత చూపిస్తుందో చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: chiranjeevi prabhas kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X