Vishwambara: చిరంజీవి విశ్వంభర పై రూమర్లు.. ద‌ర్శ‌కుడు వశిష్ట క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర (Vishwambhara). ఈ మూవీ సంబంధించిన అప్‌డేట్స్‌ లేకపోవడంతో దీనిపై రకరకాల రూమర్స్‌ ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుండటంతో, 'విశ్వంభర' కూడా రెండు భాగాలుగా విడుదల కానుందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలపై దర్శకుడు వశిష్ఠ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఈ సోషియో ఫాంటసీ మూవీలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. మౌని రాయ్ ప్రత్యేక గీతంలో చిరంజీవితో స్టెప్పులు వేయడానికి కలిసి సమాచారం. అదనంగా రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత బాధ్యతలను ఆస్కార్ విజేత M. M. కీరవాణి నిర్వహిస్తున్నారు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం 'హను-మాన్' ఫేమ్ గౌర హరిని కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Chiranjeevi Vishwambhara Not Releasing in Two Parts Director Vassishta Clarifies

అయితే. గత కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై అనేక రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల 'విశ్వంభర' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంపై దర్శకుడు వశిష్ఠ వెంటనే స్పందించారు. "విశ్వంభర రెండు పార్ట్స్‌గా రానుంది" అనే పోస్టుపై వశిష్ఠ వ్యంగ్యంగా "అవునా.. నిజమా?" అంటూ రిప్లై ఇచ్చారు.

ఈ ఒక్క కామెంట్‌తోనే సినిమా రెండు భాగాలుగా రావడం లేదని, ఒకే ఎపిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమైంది. దర్శకుడి రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, మెగా అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో భారీ చిత్రాలను రెండు లేదా మూడు భాగాలుగా తీసుకురావడం సాధారణమైపోయింది. అలాంటి సమయంలో 'విశ్వంభర' కూడా అదే బాటలో వెళ్తుందా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణం గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారట. ఈ చిత్రంలో దాదాపు 4,800కు పైగా హైఎండ్ వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇందుకోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దింపినట్లు టాక్ వినిపిస్తోంది. సుమారు రూ.75 కోట్లకు పైగా కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌కే ఖర్చు చేస్తున్నారనే ప్రచారం కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా 'సత్యలోకం' నేపథ్యంలోని విజువల్ సెటప్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

గతంలో ఓ సందర్భంలో దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ.. "14 లోకాల చుట్టూ సాగే కథ ఇది. హీరో ఆ లోకాలకు ఎలా వెళ్తాడు? హీరోయిన్‌ను ఎలా తిరిగి తీసుకొస్తాడు?" అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని చెప్పారు. ఈ ప్రపంచాలను వాస్తవానికి దగ్గరగా చూపించేందుకు భారీ సెట్స్ నిర్మించామని, ప్రపంచంలోనే టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవిని ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో ఈ చిత్రంలో చూపించబోతున్నామని కూడా చెప్పారు. 'విశ్వంభర' సాధారణ ఫాంటసీ సినిమా కాదని, తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక భారీ విజువల్ వండర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X