Waltair Veerayya: చిరంజీవి మూవీకి డీసెంట్‌ కట్.. బాలయ్య కంటే తక్కువే

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. రీఎంట్రీలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సినిమాలను అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే చిరంజీవి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని సినిమాలను కూడా చేస్తున్నారు. ఇలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 154వ సినిమా 'వాల్తేరు వీరయ్య'ను చేస్తోన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఫారెన్ వెళ్లింది. అది కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Chiranjeevi Waltair Veerayya Run Time Details Leaked

మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కాంబోలో రూపొందుతోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ కూడా చాలా వరకూ కంప్లీట్ అయిపోయిందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ (రెండు పాటలు మినహా) తాజాగా పూర్తైనట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రానికి ఫైనల్‌గా 2 గంటల 30 నిమిషాల నిడివితో రాబోతుందని తెలిసింది. ఇది డీసెంట్ రన్ టైం అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీకి మాత్రం ఫైనల్‌గా 2 గంటల 43 నిమిషాల నిడివి ఉందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Chiranjeevi Waltair Veerayya Run Time Details Leaked

చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో బాబీ రూపొందిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X