Don't Miss!
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya ట్రెండింగ్ లో 'నువ్వు శ్రీదేవి అయితే' సాంగ్.. ఒక్కరోజులో అన్ని వ్యూస్!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి టాక్ అందుకున్న ఆయన మరో చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఏసీపీ విక్రమ్ గా అలరించనున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన నువ్వు శ్రీదేవి అయితే పాట అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.

సంక్రాంతి కానుకగా..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది.

నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా..
బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచానలు మాములుగా లేవు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ చిత్రం పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదివరకు విడుదలైన బాస్ పార్టీ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఇటీవల ఈ సినిమా నుంచి రెండో పాట "నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా" అంటూ సాగే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించి ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను జస్ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఈ సాంగ్ నిన్న విడుదల కాగా ఒక్కరోజులేనే 5 మిలియన్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
|
రాకింగ్ కాంబో అంటా..
అంతేకాకుండా అద్భుతమైన లిరిక్స్ ఉన్న "నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా" పాట యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దుమ్ములేపుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ లో తెలిపింది. రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు- నీ నవ్వు అని ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సాంగ్ ను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విట్జర్లాండ్-ఇటలీ బార్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటేన్ లోయలో చిత్రీకరించారని చిరింజీవి తెలిపారు. ఈ లోయలోని లోకేషన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడి లోయ అందాలు చూసి తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని పేర్కొన్నారు. అలాగే అక్కడ మైనస్ 8 డిగ్రీల చలిలో డ్యాన్స్ చేశామని చిరంజీవి చెప్పుకొచ్చారు.