'నా ఇంటి పేరు కాపాడు'.. కూతురు సుష్మితకు చిరంజీవి హెచ్చరిక
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్టులను సొంతం చేసుకున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రంతో ఏకంగా 250 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశారు. ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ చిత్రం ఆశించిన మేర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహించారు చిరంజీవి. ఈ సందర్భంగా క్రేజీ ప్రాజెక్టులను సినిమాకు సెట్స్ మీదకు తీసుకెళ్తూ ఉన్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసారా దర్శకుడు మల్దిడి వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్ కు విశ్వంభర అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగానే, రీసెంట్ గా చిరంజీవి తన రాబోయే చిత్రం Mega157ను ప్రారంభించారు. రీసెంట్ గా ఈ మోస్ట్ అవైటెడ్ ఫీలింకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.

అయితే ఈ సినిమాను సాహు గారపాటి, మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇక సుష్మిత తన తండ్రి చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రాలకు తానే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక నిర్మాతగాను సేనాపతి, షూట్ అవుట్ ఎట్ ఆలేరు, శ్రీదేవి శోభన్ బాబు వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇక ఇప్పుడు మరొకసారి కొణిదెల సుష్మిత ప్రొడ్యూసర్ గా మారారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి తన కూతురు కొణిదెల సుష్మితతో అన్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సినిమా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ షేర్ అండ్ ఇస్తున్న క్రమంలో చిరంజీవి తన కూతురు సుష్మితతో ఇలా అన్నారు.
సుస్మిత మాట్లాడుతూ తన తండ్రిని నా పేరు కొణిదల సుష్మిత అంటూ పరిచయం చేసుకుంటుంది. దీంతో చిరంజీవి వెంటనే ఆ ఇంటి పేరును కాపాడు అని ఫన్నీ కామెంట్ పేలుస్తాడు... అయితే చిరంజీవికి మొదటిసారిగా సుష్మిత కొణిదెల ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండడంతో సినిమా ను గ్రాండ్ గా నిర్మించి, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందాలని ముందుగానే తన కూతురుకు చిరంజీవి ఇలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ' సంక్రాంతికి వస్తున్నాం' టెక్నికల్ టీం మొత్తం ఈ క్రేజీ ప్రాజెక్టుకు వర్క్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











