Women's Day: హీరోయిన్లు అందరినీ ఏకం చేసి... మెగాస్టార్ బిగ్ సర్ ప్రైజ్!
మెగా స్టార్ చిరంజీవి తన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాస్ సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తుంటారు. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. రాష్ట్రం, దేశంలో ఎలాంటి విజయోత్సవాలైనా, ప్రత్యేకమైన రోజుల్లోనూ, విజయోత్సవాలు, కఠిన పరిస్థితుల్లో స్పందిస్తూ ఉంటారు. తనకు వీలైనంత వరకు సాయం అందిస్తూనే వస్తున్నారు. ఇక ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2025 కావడం విశేషం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన చిత్రాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.
మెగా చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా నటజీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన కెరీర్ లో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ తో కలిసి పనిచేశారు. అలనాటి తారలు ఎన్టీఆర్, ఏఎన్నార్ తదితర తారాగణంతో వెండితెరపై అలరించారు. కాగా చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి అన్నీ లెక్కలను మార్చేశారు. అది వేరే విషయమైతే.. మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరీర్ లోనే చాలా మంది హీరోయిన్లతో కలిసి పనిచేశారు. ఆయనతో కలిసి చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు మంచి గుర్తింపు దక్కింది.

మరోవైపు మెగాస్టార్ ధీటైన నటనకు పలువురు హీరోయిన్లు సరిపోయేలా యాక్ట్ చేసిన 90ల ఆడియెన్స్ ను అలరించారు. చిరంజీవికి ఆన్ స్క్రీన్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆయనతో కలిసి పనిచేసిన కొంత మంది హీరోయిన్లను తన ఇంటికి ఆహ్వానించి మహిళా దినోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా తోటి నటీమణులతో దిగిన బ్యూటీఫుల్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఎక్స్ వేదికగా మెగాస్టార్ ఆ అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ విషెస్ తెలిపారు. అయితే చిరంజీవి కెరీర్ లోనే ఇదొక్క అద్భుతమైన పిక్చర్ అని అభిమానులు అంటున్నారు. మహిళలకు మెగాస్టార్ ఇస్తున్న గౌరవానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లను గుర్తు చేసుకొని మరీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేశారు. తన హీరోయిన్లతో పాటు తన భార్య కొణిదెల సురేఖను ప్రత్యేకంగా విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా 'భోళా శంకర్' చిత్రంతో అలరించిన చిరు.. ప్రస్తుతం 'బింబిసార' డైరెక్టర్ మల్దిడి వశిష్ఠ డైరెక్షన్ లో 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











