పదవి అలంకారం కాకూడదు.. బాధ్యతగా పనిచేయండి.. ఫిలిం క్రిటిక్స్‌కు మెగాస్టార్ చిరంజీవి అభినందన

టాలీవుడ్‌లోని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని నియమించింది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అసోసియేషన్ ఎన్నికలు జూలై 25వ తేదీ ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగాయి. తాజా కార్యవర్గానికి అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఎంపికయ్యారు. అన్ని పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, కోశాధికారి పోస్ట్ కోసం హేమసుందర్, నాగభూషణం మధ్య పోటీ జరిగింది.. ఈ పోటీలో హేమసుందర్ విజయం సాధించారు.. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ రావు రిటర్నింగ్ అధికారిగా ఎన్నికలను నిర్వహించారు.

ఆదివారంనాడు ఎంపికైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి సోమ‌వారంనాడు మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలియ‌జేశారు. అధ్యక్షుడు ప్రభుకు చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే మిగిలిన క‌మిటీ స‌భ్యుల‌కు తన శుభాకాంక్ష‌లు తెలియ‌జేయాలని కోరినట్టు తెలిసింది.

Chiranjeevi Wishes newly elected Film Critics Association members

ప్రభుతో చిరంజీవి మాట్లాడుతూ.. అధ్య‌క్షులైన మీకు ఇదొక మంచి అవ‌కాశం. మీ వాళ్ళంద‌రికీ మంచి చేయ‌డానికీ, వారి సంక్షేమం కోసం మీ సేవ‌లు అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. ప‌ద‌వి అలంకారం కాకుండా బాధ్య‌త‌గా ప‌నిచేయండి. ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డండి. త‌ద్వారా మాన‌సిక ఆనందం ఎంత వుంటుందో ఊహించ‌లేరు. అలాగే నా మిత్రులైన మిగిలిన వారంతా మీ మార్కు సేవ‌లు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా ఉండాల‌నీ, ఉంటార‌ని అనుకుంటున్నాను అని చిరంజీవి అన్నట్టు తెలిసింది. ఈ మేరకు ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ ప్రకటనలో తెలిసింది.
మ‌రొక్క‌సారి శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తూ,,
మీ చిరంజీవి.

Chiranjeevi Wishes newly elected Film Critics Association members

2019, 2021 కార్యవర్గానికి సహకరించిన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిాపరు. కొత్తగా ఎన్నికైన కమిటీ కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా. నూతన కార్యవర్గానికి అభినందనలు అని సురేష్ కొండేటి పేర్కొన్నారు.

ఫిలిం క్రిటిక్ క్లబ్ కార్యవర్గం:

అధ్యక్షుడు: ఏ ప్రభు,
ఉపాధ్యక్షులు: నాగేంద్ర కుమార్, మోహన్ ఓగిరాల
ప్రధాన కార్యదర్శి: పర్వతనేని రాంబాబు
ఉప కార్యదర్శులు: యల్ రాంబాబు వర్మ, చిన్నముల రమేష్
కోశాధికారి: హేమసుందర్
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్: సాయి రమేష్, అబ్దుల్, సురేష్ కవిరాయని, ధీరజ్ అప్పాజీ, భాగ్యలక్ష్మి, టి మల్లికార్జున్, జిల్లా సురేష్, మురళి, వీర్ని శ్రీనివాసరావు, కుమార్ వంగాల, నవీన్ సిహెచ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X