కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చిరంజీవి ట్వీట్: ఇదే మంచి అవకాశం అంటూ కామెంట్

సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందులో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలో తెరిచిన ఆయన.. తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను షేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో సమాజంలో జరిగే ఎన్నో విషయాలపైనా స్పందిస్తూ తనదైన శైలి పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. దీంతో నిత్యం వార్తల్లో ఉంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ జీ కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్థరణలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలోనే ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీనిని పురస్కరించుకుని చిరంజీవి ట్విట్టర్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీకు మంచి అవకాశం దొరికింది. ఈ అనుభూతిని, గౌరవాన్ని చక్కగా ఆస్వాదించండి' అంటూ ట్వీట్ చేశారాయన.

Chiranjeevi Wishes to Central Minister G. Kishan Reddy

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనితో పాటు మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్', తమిళ చిత్రం 'వేదాళం'ను కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలతో పాటు కేఎస్ రవీంద్రతో మరో చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X