స్పీడు పెంచిన చిరంజీవి: అనుకున్న సమయానికంటే ముందుగానే ముహూర్తం

గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో చాలా నెమ్మదిగా సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎంతో వేగంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది డైరెక్టర్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమాను చేస్తోన్న మెగాస్టార్.. దీని తర్వాత మలయాళ చిత్రం 'లూసీఫర్'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

'లూసీఫర్' రీమేక్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారు. వాస్తవానికి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 నుంచి ప్రారంభించబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పది రోజుల ముందుగానే అంటే ఆగస్టు 12 నుంచి పట్టాలెక్కించబోతున్నారట. ఇప్పటికే దీని కోసం హైదరాబాద్ నగర శివారులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు.

Chiranjeevis Lucifer Regular Shooting Starts From August 12th

ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. ఇందులో చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే లోకల్ డాన్‌గా నటిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు 'కింగ్ మేకర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. దీన్ని రామ్ చరణ్, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X