చిరంజీవి కొత్త సినిమాకు పడిన పునాది: అది కూడా అతి త్వరలోనే ఆరంభం
కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. గతంతో పోలిస్తే రీఎంట్రీలో మరింత స్పీడు చూపిస్తోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'లూసీఫర్' రీమేక్ కూడా ఉంది. ఎప్పుడో ప్రకటించిన ఈ మూవీ ఇంకా మొదలవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి 'లూసీఫర్' రీమేక్‌ను చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. దీన్ని తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన సురేష్ సెల్వరాజన్ నిర్మిస్తున్నారు. గతంలో పలు తెలుగు సినిమాలకు పని చేసిన ఆయన.. చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య'కూ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆయన సారథ్యంలోనే టెంపుల్ టౌన్ సెట్ నిర్మితమైంది. ఆ పని చూసిన తర్వాత 'లూసీఫర్' రీమేక్ సెట్ పనులు కూడా ఆయనకు అప్పగించారట చిరు. ఇది పూర్తైన వెంటనే షూట్ మొదలెట్టబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మలయాళంలో తెరకెక్కిన 'లూసీఫర్' మూవీ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే డాన్‌గా కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు 'కింగ్ మేకర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీన్ని రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. నయనతార కూడా ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











