Chiranjeevi: అనిల్ రావిపూడికి చిరంజీవి ఛాలెంజ్.. ఈ సారి సక్సెస్ కొడితే కారు కాదు..

Chiranjeevi: సంక్రాంతి 2026 కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు (Mana ShankaraVaraPrasad Garu)' సినిమా టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు.. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.

ఫలితంగా 'మన శంకర వరప్రసాద్ గారు' ఇప్పటివరకు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సంక్రాంతి సీజన్‌లో ఆల్‌టైమ్ బిగ్ విన్నర్‌గా నిలిచింది. ఈ భారీ విజయం నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు, టెక్నీషియన్లు హాజరై విజయోత్సాహాన్ని పంచుకున్నారు.

వింటేజ్ చిరంజీవి కాదు... వింటేజ్ సెలబ్రేషన్స్
సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ మాట్లాడుతూ.. 'అన్నం ఎప్పుడైనా బోర్ కొడుతుందా? సక్సెస్ కూడా అలాంటి విషయమే.. మీ ప్రేమ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అయితే.. ప్రేక్షకుల దగ్గరికి వెళ్లి ఆ విజయాన్ని మీలాగా పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని కొన్నిసార్లు బాధపడతాను. దాదాపు రెండు తర్వాత ఎగ్జిక్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి ఇలా ఆనందాన్ని పంచుకునే వేదిక దొరికింది. ఈ వేదిక కళకళలాడుతోంది. గత వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నట్టుంది' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా ప్రశంసించిన చిరంజీవి, 'వింటేజ్ చిరంజీవినే కాదు... వింటేజ్ సెలబ్రేషన్ మూడ్‌ను కూడా తిరిగి తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడికే దక్కుతుంది' అంటూ అన్నారు.

రాఘవేంద్రరావు - వివి వినాయక్‌లను గుర్తు చేసిన అనిల్
అనిల్ రావిపూడి పని శైలిపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అనిల్ ఇతర నటీనటులు, టెక్నీషియన్లతో మెలిగే తీరు చూస్తే నాకు దర్శకుడు రాఘవేంద్రరావు గారు గుర్తొస్తారు. వాస్తవానికి అనిల్‌ను రాఘవేంద్రరావు గారే పరిచయం చేశారు. ఒక విత్తనం నాటితే అది వటవృక్షంగా మారినట్టు, అనిల్ ఈ స్థాయికి ఎదిగాడు' అని కొనియాడారు. అలాగే మాస్ లుక్స్, కమర్షియల్ టేకింగ్ విషయంలో అనిల్ పనితనం చూస్తే దర్శకుడు వివి వినాయక్ వర్కింగ్ స్టైల్ గుర్తొస్తుందని చిరంజీవి అన్నారు.

షూటింగ్ రోజులు మర్చిపోలేనివి
'గత పది సంవత్సరాల్లో 'వాల్తేరు వీరయ్య', 'ఖైదీ నెంబర్ 150' సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్‌ను కూడా చాలా ఎంజాయ్ చేశాను. షూటింగ్ పూర్తయ్యాక ఫేర్‌వెల్ పార్టీ లాగా అందరూ వెళ్లిపోయినప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది. చివరి రోజు టెక్నీషియన్లందరితో మనస్ఫూర్తిగా మాట్లాడి కృతజ్ఞతలు చెప్పాను. అందరూ ఒక కుటుంబంలా కలిసిపోయాం. ఇలాంటి ఫీలింగ్ ఉన్న సినిమా ఆటోమెటిగ్గా మంచి సక్సెస్ అవుతుంది' అని చిరంజీవి తెలిపారు.

వెంకటేష్‌పై ఫన్నీ కామెంట్స్
విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ చిరంజీవి సరదాగా వ్యాఖ్యలు చేశారు. 'వెంకీ అన్న సెట్‌లో ఉంటే సందడి సందడే. యంగ్ హీరోలు ఎంజాయ్ చేసినట్టు మేమిద్దరం కూడా చాలా సరదాగా చేశాం. నా పాటలకు అతడు డాన్స్ చేయడం, అతని పాటలకు నేను డాన్స్ చేయడం ఈ సినిమాలో పెద్ద హైలైట్' అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌ను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన అనిల్ రావిపూడి గొప్పతనాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేశారు.

ఈసారి కార్ కాదు... హెలికాప్టర్!
ఈ వేడుకలో చిరంజీవి అనిల్ రావిపూడిని దగ్గరికి పిలిచి నవ్వులు పూయించారు. 'నాతో సినిమా చేస్తావా లేదా నీ ఇష్టం.. ఇంకేమిటి కార్ వచ్చింది పని అయిపోయింది అనుకుంటావా? ఈసారి సక్సెస్ అయితే హెలికాప్టర్ ఇస్తా' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, 'నాకు ముఖ్యమైనది గిఫ్ట్ కాదు... షూటింగ్ సమయంలో అనుభవించిన ఆనందం. అది నా జీవితంలో మర్చిపోలేనిది'అంటూ అనిల్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన గిఫ్ట్
ఇదిలా ఉండగా, ఈ సినిమా విజయంలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ ఇచ్చిన ఈ గిఫ్ట్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్‌లో దర్శకులకు హీరోలు ఇలాంటి విలువైన బహుమతులు ఇవ్వడం అరుదైన విషయం కావడంతో, చిరంజీవి గొప్ప మనసును అభిమానులు కొనియాడుతున్నారు.

'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటివరకు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, సంక్రాంతి బాక్సాఫీస్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. వింటేజ్ చిరంజీవి కామెడీ, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్ కలిసి ఈ సినిమాను ఆల్‌టైమ్ ఫెస్టివల్ బ్లాక్‌బస్టర్‌గా మార్చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X