‘చిత్రలహరి’ సెన్సార్ రిపోర్ట్, నో కట్స్.. భారీ రిలీజ్ దిశగా ఏర్పాట్లు!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం చిత్రలహరి. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. బోర్డ్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై భారీ హైప్ రావడంతో రిలీజ్ కూడా అదే స్థాయిలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కిషోర్ తిరుమల సినిమా అంటేనే వినోదం ఉంటూనే ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో చిత్రలహరి తెరకెక్కిందని చిత్ర బృందం చెబుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరింత ప్లస్ అవ్వనుంది.
సాయిధరమ్‌తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.


Click it and Unblock the Notifications











